Short Telugu meditations · poetic fragments
5 | 16MAR2026
మరో ప్రపంచం పుట్టుకొస్తున్న సమయం
అంతరం సర్వం అయోమయం
నా హృదయంలో గందరగోళం
రేపుతున్నది అనవసర యుద్ధం
4 | 27FEB2026
మనతో మనం ఉండగలమా? ప్రపంచమర్ధమైతే చాలా? అదే జ్ఞానోదయమా? లేక రాగ-ద్వేషాలు, శోకం, క్రోధం, భయం, ప్రేమ, వ్యామోహం... ఇలా వీటి మాయలో పడకుండా ఇంద్రియాలను మన అదుపులో ఉంచుకోవడమా? ఇంద్రియాలే కాదు, ఇంద్రియార్థాలు. ఆలోచనలు.
కానీ అలాగే జీవితాన్ని, మనకు కలిగిన అనుభవాలను, పూర్తిగా స్వీకరించాలి. జీవితాన్ని జీవించాలి. తీసుకొని వదిలేయటం మాత్రమే జీవితం కాదు.
3 | 16FEB2026
అసలు నాకు నేను ఏంటి? ఆ ప్రశ్నకి జవాబు శాశ్వతంగా మారిపోకుండా ఉండిపోతుందా? నేను ఎలా ప్రవర్తించాలి? నాకు నేను వేటికి జవాబులు చెప్పుకోవాలి? ఏవి ఆలోచించాలి? ఏవి అనుభవించాలి?
ఎంత పని ఎక్కువ? ఎంత పని తక్కువ? ఎవరి కోసం? నాకెందుకు? నేనెందుకు చెయ్యాలి? నేను ఎప్పుడైతే చేస్తా? ఎందుకైతే చేస్తా? ఎలా ఐతే? నాకేంటి తక్కువ? ఏంటి ఎక్కువ?
2 | 14DEC2025
In the same mind there are two beings —
చూసినవాడిని నేను, రాసిన వాడను నేను
ఈ చూపుకి రాతకి వెనక మరొక నేను
1 | 25JUL2025
కష్టం లేని జీవితం
మృత్యువు లేని పరివారం
పన్నులు లేని సమాజం
ఈ ప్రపంచం లో దుర్లభం